Google Maps: ముగ్గురి ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్
గూగుల్ మ్యాప్స్(Google Maps)ను నమ్మి నది(River)లో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: గూగుల్ మ్యాప్స్(Google Maps)ను నమ్మి నది(River)లో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది. యూపీలోని బరేలీ(Bareilly)లో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారు(car)లో ప్రయాణిస్తున్నారు. తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్(GPS)నే ప్రమాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. జీసీఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన(Bridge Under Construction) మీదికి చూపించడంతో దానినే అనుసరిస్తు వెళుతుండగా.. కారు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం(Destroyed) కాగా.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం(Died) చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారించారు. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించడం కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు.