అమర్‌నాథ్ భక్తులకు గుడ్ న్యూస్

అమర్‌నాథ్ పుణ్య క్షేత్ర యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వచ్చే జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగే ఈ యాత్ర కోసం అధికారులు రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు.

Update: 2023-04-17 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమర్‌నాథ్ పుణ్య క్షేత్ర యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వచ్చే జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగే ఈ యాత్ర కోసం అధికారులు రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. అమర్ నాథ్‌కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం అవుతుందని, అనంత్ నాగ్ జిల్లా పహాల్గాం మార్గం, గంగదేర్ బల్ జిల్లా బల్తాల్ మార్గాల్లో ఎదో ఒక దాన్ని యాత్రికులు ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.

ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా భక్తులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొననారు. పంజాబ్ నేషనల్, ఎస్ బీఐ, జమ్మూ కశ్మీర్, ఎస్ బ్యాంక్‌లలోని 542 బ్రాంచ్లలో ఆఫ్ లైన్ రిజిస్టేషన్ సదుపాయం ఉంది. కాగా, యాత్రులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం కలిగిన స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు.

Tags:    

Similar News