గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి మరో కేసులోనూ జీవిత‌ ఖైదు

32 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి ఎట్టకేలకు జీవిత‌ ఖైదు శిక్ష పడింది.

Update: 2023-06-05 14:39 GMT

వార‌ణాసి: 32 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి ఎట్టకేలకు జీవిత‌ ఖైదు శిక్ష పడింది. వార‌ణాసిలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఈ మేరకు సోమవారం తీర్పు ఇచ్చింది. ముక్తార్ ఇప్పటికే పలు కేసుల్లో జైలుశిక్ష అనుభ‌విస్తున్నాడు. 1991 ఆగ‌స్టు 3న వార‌ణాసిలో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అజ‌య్ రాయ్ ఇంటి ముందే అతడి సోద‌రుడు అవ‌దేశ్ రాయ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఆ ఘ‌ట‌న‌లో అన్సారీతో పాటు ఇత‌రుల‌పై అప్పట్లో కేసు నమోదైంది.

ఈ కాల్పులు జరిపేందుకు కారులో వచ్చిన దుండగుల్లో ముక్తార్ అన్సారీ కూడా ఉన్నాడని కాంగ్రెస్ నేత అజ‌య్ రాయ్ ఆరోపించారు. అన్సారీపై మొత్తం 61 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. అత‌డు ఈవిధంగా కేసులో దోషిగా తేల‌డం ఇది ఐదోసారి. అన్సారీపై నమోదైన ఇంకో 20 కేసులు విచార‌ణ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఓ కిడ్నాప్‌, మ‌ర్డర్ కేసులో అత‌నికి ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డింది.

Tags:    

Similar News