మాజీ సీజేఐ అహ్మదీ కన్నుమూత..

మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ ఏఎం అహ్మదీ గురువారం తుది శ్వాస విడిచారు.

Update: 2023-03-02 14:05 GMT

న్యూఢిల్లీ: మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ ఏఎం అహ్మదీ గురువారం తుది శ్వాస విడిచారు. ఉదయం 5 గంటల సమయంలో ఆయన మరణించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించారు. జస్టిస్ అహ్మదీ 1932లో సూరత్‌లో జన్మించారు. 1964లో అహ్మదాబాద్ సిటీ సివిల్, సెషన్స్ కోర్టు జడ్జి గా నియమితులయ్యారు. 1976లో గుజరాత్ హైకోర్టు జడ్జి గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1988 డిసెంబర్‌లో ఆయనకు సుప్రీం కోర్టుకు ప్రమోషన్ మీద వెళ్లారు.

1994లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ అహ్మదీ ఒక జూనియర్ సివిల్ జడ్జి కుమారుడు. కెరీర్ ఆరంభంలో ఆయన ఎక్కువ భాగం వివిధ జిల్లాలు, తాలూకాలలో నివసించారు. ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వంటి ముఖ్యమైన తీర్పుల్లో ఈయన భాగస్వామిగా ఉన్నారు.

Tags:    

Similar News