పెరగనున్న ఫుడ్ డెలివరీ ఛార్జీలు.. ఎందుకంటే?

ఫుడ్ డెలివరీ యాప్ లు మరోసారి ప్లాట్ ఫాం ఫీజుని పెంచాయి. జొమాటో, స్విగ్గీ యాప్ లలో ఇప్పటివరకు రూ.5 ఉన్న ప్లాట్ ఫాం ఫీజుని రూ.6కి పెంచాయి.

Update: 2024-07-15 05:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఫుడ్ డెలివరీ యాప్ లు మరోసారి ప్లాట్ ఫాం ఫీజుని పెంచాయి. జొమాటో, స్విగ్గీ యాప్ లలో ఇప్పటివరకు రూ.5 ఉన్న ప్లాట్ ఫాం ఫీజుని రూ.6కి పెంచాయి. దీంతో 20 శాతం పెంచినట్లయ్యింది. అయితే, ప్రస్తుతానికి ఢిల్లీ, బెంగళూరుల వంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ ఫాం ఫీజు రూ.6 గా వసూలు చేస్తున్నాయి. ఇది డెలివరీ ఫీజు, జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలకు భిన్నంగా ఉంటుంది. అయితే, ఇతర నగరాల్లో కూడా పెరిగిన ప్లాట్ ఫాం ఫీజు అందుబాటులోకి వస్తుంది.

గతంలోనూ ప్లాట్ ఫాం ఫీజుల పెంపు

జొమాటో, స్విగ్గీ ఇలా ప్లాట్‌ఫామ్‌ ఫీజులను పెంచడం ఇది తొలిసారేమీ కాదు.2023లో ఈ రెండు కంపెనీలు ప్లాట్ ఫాం ఫీజును వసూలు చేయడం ప్రారంభించాయి. రూ.2తో ఈ ఫీజుని వసూలు చేశాయి. క్రమంగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో 25 శాతం పెంచి రూ.5 చేసింది. వేగవంతమైన డెలివరీ కోసం ప్రియారిటీ ఫీజు పేరిట జొమాటో ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తోంది. ఒక్కో ఆర్డర్‌పై పొందే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఈ ఫీజును ప్రవేశపెట్టాయి.ఈ తరహా రుసుము విధించడం ద్వారా రోజుకు రూ. 1.25-1.5 కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.


Similar News