Flight Accident: రన్‌వేను తాకిన ఫ్లైట్ టెయిల్ సెక్షన్.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!

ఇండిగో ఫ్లైట్‌కు పెను ప్రమాదం తప్పిన ఘటన ఢిల్లీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

Update: 2024-09-18 02:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో ఫ్లైట్‌కు పెను ప్రమాదం తప్పిన ఘటన ఢిల్లీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Delhi International Airport)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 9న ఇండిగో ఫ్లైట్ (Indigo Flight) నెం 6E 6054 ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే, టేకాఫ్ సమయంలో టెయిల్ సెక్షన్ (Tail Section) అనూహ్యంగా రన్‌వేను తాకింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో టెయిల్ సెక్షన్ పెయింట్ ఊడిపోయి భారీగా డెంట్స్ పడి పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అప్రమత్తమైన పైలెట్ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రో‌ల్‌ (Air Traffic Control)కు సమాచారం అందజేశాడు. అనంతరం ఏటీసీ ఫ్లైట్ ల్యాండ్ చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ తోక భాగం రన్‌వేకు టచ్ అయితే టెయిల్ స్ట్రైక్ జరుగుతుందని, అది అత్యంత ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఒక్కో సమయంలో మంటలు చెలరేగి ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అన్నారు. అదృష్టవశాత్తు అలాంటి ఘటన జరగలేదని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Regulator Directorate General of Civil Aviation) దర్యాప్తునకు ఆదేశించింది. 


Similar News