Kashmir: 150 అడుగుల లోయలోపడ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు సైనికులు దుర్మరణం
జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు(Army Soldiers) ప్రయాణిస్తున్న వాహనం 150 అడుగుల లోయలో పడింది.
దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు(Army Soldiers) ప్రయాణిస్తున్న వాహనం 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 18 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఎల్‌వోసీ(LOC)లోని బల్నోయి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన, మృతిచెందని ఆర్మీ జవాన్లను సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.