దేశంలోనే తొలి సైకియాట్రిక్ ఆపరేషన్ సక్సెస్..

మన దేశంలో మానసిక సమస్యలు ఉన్నవారికి మందులను ఇస్తుంటారు.

Update: 2023-06-25 14:24 GMT

ముంబై: మన దేశంలో మానసిక సమస్యలు ఉన్నవారికి మందులను ఇస్తుంటారు.. వైద్య నిపుణులు కౌన్సెలింగ్ చేస్తుంటారు.. అయితే తొలిసారిగా ఓ రోగికి సైకియాట్రిక్ సర్జరీ చేశారు. గత 26 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో పోరాడుతున్న 38 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళకు ముంబైలోని పెద్దర్ రోడ్‌లో ఉన్న జస్ లోక్ ఆస్పత్రిలో న్యూరో సర్జన్ పరేశ్ దోషి సక్సెస్ ఫుల్‌గా ఆపరేషన్ చేశారు. 2017లో మన దేశంలో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్‌ను ఆమోదించారు. అది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సైకియాట్రిక్ సర్జరీ ఇదే.

కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. సర్జరీ చేసుకునేందుకు రోగి సమ్మతి తెలిపినా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు నుంచి ఆమోదం పొందాకే వాటిని చేయాల్సి ఉంటుంది. తాజాగా ఆస్ట్రేలియన్ మహిళ ఆపరేషన్ కోసం అప్లై చేసుకుంటే.. అప్రూవల్ లభించడానికి 10 నెలల టైం పట్టింది. డిప్రెషన్ అనేది చాలామందికి మాత్రలు, వివిధ థెరపీల ద్వారా నయం అవుతుంది. కొంతమందికి మాత్రం నయం కాదు. అలాంటి వారికి చివరి ప్రయత్నంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) సర్జరీని అందిస్తారు. దీనిలో న్యూరో పాత్‌వేలను మార్చడానికి మెదడులో ఎలక్ట్రోడ్‌లు అమరుస్తారు.


Similar News