ChatGPT-Aadhar: ఏఐతో నకిలీ ఆధార్, పాన్ కార్డుల సృష్టి

యూజర్లు 70 కోట్లకు పైగా ఫోటోలను గిబ్లీ స్టైల్‌లో రూపొందించారు

Update: 2025-04-04 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తొలినుంచి ఏఐ టెక్నాలజీ ఎంత ప్రయోజనకరమో అంతటి ప్రమాదమని కూడా లాంటి కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ జీపీటీ40 పేరుతో ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వచ్చినప్పటికీ నుంచి యూజర్లు 70 కోట్లకు పైగా ఫోటోలను గిబ్లీ స్టైల్‌లో రూపొందించారు. ఇది ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. అయితే, ఈ కొత్త ఫీచర్‌ను కొందరు యూజర్లు తప్పుడు పనులకు వాడుతున్నట్టు సమాచారం. దీని ద్వారా నకిలీ ఆధార్ కార్డ్ ఫొటోలను సృష్టించేందుకు ఉపయోగిస్తున్నారనే ఆందోళనలు పెరిగాయి. ఈ ఏఐ చాట్‌బాట్‌లలో నకిలీ ఆధార్ కార్డులు మాత్రమే కాదు నకిలీ పాన్ కార్డులను కూడా సృష్టిస్తున్నారు. ఈ నకిలీ కార్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నకిలీ కార్డుల సృష్టి సామాన్యుల నుంచి ఎలన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ వంటి ఇతర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్ల మీద కూడా జరుగుతున్నట్టు కొన్ని పోస్టులు కనిపించాయి. క్యూఆర్ కోడ్, ఆధార్ నంబర్‌తో పాటు ఆధార్ కార్డుపై ఉండే ఫోటోలు, అంచున ఉండే ఎరుపు రంగు లైన్, ప్రభుత్వ అధికారిక గుర్తు కూడా దాదాపు అసలైన వాటిలా ఉండటం ఆందోళన కలిగించే అంశం. భారత ప్రభుత్వం మాత్రమే జారీ చేయాల్సిన ఆధార్ కార్డును ఏఐ సాయంతో చాట్‌జీపీటీలో సులభంగా సృష్టిస్తున్నారని, దీనివల్ల భద్రతాపరమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని పరిష్కారానికి ఏఐ ఫ్రేమ్‌వర్క్ అమలు అత్యవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా భారత్ లాంటి ప్రజా సేవలకు, ఆర్థిక వినియోగం అధికంగా ఉన్న దేశంలో ఏఐ సాధనాలు, ఇతర అత్యాధునిక సాంకేతికత ద్వారా ఎదురయ్యే సవాళ్లను అడ్డుకట్ట వేసే స్థాయిలో డిజిటల్ ధృవీకరణ విధానాలను రూపొందించాలని నిపుణులు పేర్కొన్నారు.  

Tags:    

Similar News