న్యూజిలాండ్‌లో అత్యవసర స్థితి.. దేశ చరిత్రలో మూడోసారి ఎమర్జెన్సీ

న్యూజిలాండ్ భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి.

Update: 2023-02-14 13:31 GMT

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గబ్రియిల్లె తుఫాను ధాటికి సముద్రం ఉప్పొంగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నార్త్ లాండ్, ఆక్లాండ్, తైరావిటి, బే ఆఫ్ ప్లెంటీ, వైకాటో, హకేస్ బే ప్రాంతాల్లో ఈ అత్యవసర స్థితి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారని అత్యవసర నిర్వహణ మంత్రి కైరన్ మెక్ అనల్టీ తెలిపారు. ఉత్తరం వైపుగా దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. అనేక ప్రాంతాలు విద్యుత్ లేక అంధకారంలోకి వెళ్లాయని అన్నారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేసింది. అయితే ప్రాణనష్టం పై ఎలాంటి వివరాలు వెల్లడించ లేదు. న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడో అత్యవసర స్థితి కావడం గమనార్హం. అంతకుముందు భూకంపం, కరోనా సమయంలో రెండు సార్లు అత్యవసర స్థితి ని ప్రకటించింది.

Tags:    

Similar News