కాంగ్రెస్ షాకింగ్ డెసిషన్.. పార్టీ నుంచి 39 మంది నేతల బహిష్కరణ
కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేతల నుంచి తలనొప్పులు తప్పడం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేతల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, టికెట్ కేటాయించలేని వర్గాలుగా విడిపోతున్నారు. కొందరు రెబల్స్‌గా పోటీ చేస్తామని ప్రకటిస్తుండగా, మరి కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీని ధిక్కరించిన 39 మంది నేతల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే బహిష్కరించినట్లు ఎంపీ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, ఉపాధ్యక్షుడు రాజీవ్ సింద్ ప్రకటించారు. బహిష్కరణకు గురైన వాళ్లలో సీనియర్ నేతలు మాజీ ఎంపీ ప్రేమ్‌చంద్ గుడ్డూ, మాజీ ఎమ్మెల్యేలు అంతార్ సింగ్ దర్బార్. యడ్వేంద్ర సింగ్, అధికార ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్, నజీర్ ఇస్తామ్, అమిర్ అక్వీల్ తదితరులు ఉన్నారు.