Delhi Exit Polls: అధికార ఆప్‌కు షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు.. ఆ పార్టీకే పీఠం అంటున్న అన్ని సర్వేలు

ఢిల్లీలో అధికార ఆప్‌(AAP)కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2025-02-05 13:29 GMT
Delhi Exit Polls: అధికార ఆప్‌కు షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు.. ఆ పార్టీకే పీఠం అంటున్న అన్ని సర్వేలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో అధికార ఆప్‌(AAP)కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election) పోలింగ్ ప్రక్రియ ముగియగా.. ఆయా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మినహా మిగిలిన అన్ని సర్వే సంస్థలు బీజేపీకే అధిక సీట్లు రాబోతున్నట్లు పేర్కొంటున్నాయి. ఇక పర్‌ఫెక్ట్ ప్రిడిక్షన్‌తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అంచనా వేసే చాణక్య స్ట్రాటజీస్(Chanakya Strategies) సర్వే సంస్థ.. ఢిల్లీ ఎన్నికలపైనా సర్వే చేసింది. తాజాగా.. వారి సర్వే ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆప్‌కు 25-38, బీజేపీకి 39-44, కాంగ్రెస్‌కు 02-03 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం నమోదైంది. గతంతో పోలిస్తే ఇది ఎక్కువ(Increased Polling Percentage). ప్రస్తుతం ఆరు గంటల తర్వాత ముగిసినా క్యూ లైన్లలో ఉన్న వారికి అనుమతి ఇస్తున్నారు. దీంతో పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఆప్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ఎలాగైనా జెండా పాతాలని మూడు పార్టీలు కాస్త గట్టిగానే ప్రయత్నం చేశాయి. ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆగాల్సిందే.

ఎగ్జిట్‌ పోల్స్‌ :

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 51-60, ఆప్‌ 10-19

ఏబీపీ మ్యాట్రిజ్‌: బీజేపీ 35-40, ఆప్‌ 32-37

ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్‌ 27-30, కాంగ్రెస్‌ 1-3

చాణిక్య స్ట్రాటజీస్‌: బీజేపీ 39-44, ఆప్‌ 25-28

కేకే సర్వే: బీజేపీ 22, ఆప్‌ 39

ఢిల్లీ టౌమ్స్‌ నౌ: బీజేపీ 39-45, ఆప్‌ 22-31

Tags:    

Similar News