CISF జవాన్ల వాహనాన్ని గుద్ది ఈడ్చుకెళ్లిన రైలు
రైల్వే పట్టాలపై ఆగిపోయిన జవాన్ల వాహనాన్ని రైలు ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రైల్వే పట్టాలపై ఆగిపోయిన జవాన్ల వాహనాన్ని రైలు ఢీ కొట్టి (Hit by a train) ఈడ్చుకెళ్లిన. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ (Suratgarh) సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో లెవల్ క్రాసింగ్ వద్ద CISF (కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం) జవాన్ల వాహనం (Army vehicle) క్రాసింగ్ చేస్తుండగా అదుపుతప్పి రైలు పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో పట్టాలపై వేగంగా వచ్చిన రైలు జవాన్లు ఉన్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో పాటు చాలా దూరం అలానే ఈడ్చుకెళ్ళింది. ప్రమాద సమయంలో వాహనంలో ముగ్గురు CISF సిబ్బంది ఉన్నారు. కాగా అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. CCTV ఫుటేజ్ ప్రకారం.. ఈ ప్రమాదం బూమ్ బారియర్లు (Boom Barriers) లేకపోవడం వల్ల సంభవించినట్లు స్పష్టం అవుతుంది.