CJI : బంగ్లాదేశ్ ఘటనలు చూసైనా స్వేచ్ఛ విలువను గుర్తిద్దాం : సీజేఐ

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చాటిచెప్పాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

Update: 2024-08-15 13:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో చాటిచెప్పాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభించాయని ఆయన గుర్తు చేశారు. గురువారం ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. తమ తరానికి చెందిన లాయర్లు అందరూ దేశంలో ఎమర్జెన్సీ కాలాన్ని ప్రత్యక్షంగా చూశారని ఆయన చెప్పుకొచ్చారు.

‘‘ఇప్పుడు స్వేచ్ఛ లభిస్తోంది కదా అని దాని విలువను మనం గ్రహించలేకపోతున్నాం. మాలాంటి వాళ్లు మాత్రం గతంలో స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేందుకు లీగల్ ప్రాక్టీస్‌ను వదిలేసిన డాక్టర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్, గోవింద్ వల్లభ్ పంత్, దేవి ప్రసాద్ ఖైతాన్, సర్ సయ్యద్ మహ్మద్ సాదుల్లా వంటి మహోన్నతులకు నా నివాళులు’’ అని డీవై చంద్రచూడ్ తెలిపారు.

Tags:    

Similar News