Maoist killed : చత్తీస్ గఢ్ బీజాపూర్ లో ఎన్ కౌంటర్..మావోయిస్టు మృతి

చత్తీస్ గఢ్(Chhattisgarh) బీజాపూర్ అటవీ ప్రాంతంలో గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో జరిగిన ఎదురుకాల్పులలో మావోయిస్టు(Maoist killed) మృతి చెందాడు.

Update: 2024-12-11 12:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : చత్తీస్ గఢ్(Chhattisgarh) బీజాపూర్ అటవీ ప్రాంతంలో గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో జరిగిన ఎదురుకాల్పులలో మావోయిస్టు(Maoist killed) మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టును పోలీసులు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లాగా గుర్తించారు. మావోయిస్టు పార్టీలోని నెంబర్ 2 కమాండర్ వెల్లా, మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లుతో పాటు దాదాపు 30నుంచి 40 మంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లుగా తమకు సమాచారం అందడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టామని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో భద్రతా బలగాలపై మావోలు కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

చత్తీస్ గడ్ అడవుల్లో ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తరుచు ఎన్ కౌంటర్లు చోటుచేసుకుంటుండగా..ఏడాది కాలంలో 250మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్​జీఏ వారోత్సవాల నిర్వాహణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రత బలగాలు వాటిని భగ్నం చేసేందుకు మరింతగా ఏరివేత చర్యలు చేపట్టాయి. 

Tags:    

Similar News