Liquor : ఏజ్ వెరిఫికేషన్ చేశాకే మద్యం విక్రయం.. 25 ఏళ్లకు పైబడిన వారికే లిక్కర్‌

దిశ, నేషనల్ బ్యూరో : హోటళ్లు, క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-12-11 17:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హోటళ్లు, క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల(Delhi Clubs) నిర్వాహకులకు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 25 ఏళ్లకు పైబడిన వారికే లిక్కర్(Liquor) విక్రయించాలని.. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లాంటి ధ్రువపత్రాలతో వారి ఏజ్‌ను వేరిఫై(Age Verification) చేసుకోవాలని నిర్దేశించింది. ఈక్రమంలో ఫిజికల్ ఐడీలను మాత్రమే పరిశీలనలోకి తీసుకోవాలని సూచించింది. వర్చువల్ ఐడీలను పరిగణనలోకి తీసుకుంటే.. ఫేక్, ఎడిటెడ్ ఐడీలు చలామణిలోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

అయితే డిజిలాకర్‌ పోర్టల్‌లో నిక్షిప్తమై ఉండే ఐడీ ప్రూఫ్‌లను వెరిఫికేషన్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. వయసు వివరాలను ధ్రువీకరణ చేసుకోకుండా ఎవరికీ మద్యాన్ని విక్రయించొద్దని తేల్చి చెప్పింది. ఈ ఆర్డర్స్‌ను ధిక్కరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ పరిధిలోని హోటళ్లు, క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లలో 25 ఏళ్లకు పైబడిన వారికే లిక్కర్‌ను విక్రయించాలి అనేది రూల్. దీన్ని పలుచోట్ల ఉల్లంఘిస్తున్నారనే అభియోగాలు వచ్చాయి. అందువల్లే తాజా ఆదేశాలను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ జారీ చేసింది.

Tags:    

Similar News