Bangladesh: బీఫ్ అందించని రెస్టారెంట్లను బహిష్కరించాలి.. బంగ్లాదేశ్‌లో ర్యాలీ

బీఫ్ అందించని రెస్టారెంట్లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢాకాలో ముస్లిం వినియోగదారుల హక్కుల మండలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Update: 2024-12-11 16:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీఫ్ (Beef) అందించని రెస్టారెంట్లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ముస్లిం వినియోగదారుల హక్కుల మండలి ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. రెస్టారెంట్ల మెనూలో తప్పని సరిగా బీఫ్ వంటకాలు చేర్చాలని పిలుపునిచ్చారు. దీనిని పాటించని హోటళ్లను వెంటనే మూసివేస్తామని హెచ్చరించారు. కొన్ని రెస్టారెంట్లు గొడ్డు మాంసం వడ్డించడాన్ని బ్యాన్ చేస్తున్నాయని, ముస్లిం వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది విరుద్ధమని తెలిపారు. గొడ్డు మాంసం ఇస్లామిక్ (Islamic) గుర్తింపుకు చిహ్నంగా పనిచేస్తుందని కౌన్సిల్ కన్వీనర్ మహమ్మద్ ఆరిఫ్ అల్ ఖబీర్ (Al khabeer) చెప్పారు. పాశ్చాత్య దేశాలు తమ రెస్టారెంట్లలో హలాల్ ఆహారాన్ని ఉంచడం లేదని ఇది సరైన పద్దతి కాదని అన్నారు.

బంగ్లాదేశ్‌లోని హిందువు (Hindus)లకు ప్రత్యామ్నాయాలు అవసరమైతే, ముస్లింల సంస్థల్లో ముస్లింల హక్కులను హరించే బదులు వారి సొంత రెస్టారెంట్లను తెరవాలని సూచించారు. బీఫ్‌కు సంబంధించి ఒక్క మెనూ కూడా అందించని రెస్టారెంట్‌పై హిందుత్వ అనుకూలత, భారత్‌కు చెందిన ఏజెంట్ అని ముద్ర వేస్తామని, ఆ తర్వాత దేశవ్యాప్త బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, బంగ్లాదేశ్‌లో మతపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ర్యాలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News