Delivery Workers: డెలివరీ వర్కర్లకు గుడ్ న్యూస్.. త్వరలో కేంద్రం కొత్త పథకం..!

భారతదేశం(India)లో ఇటీవల కాలంలో ఈ- కామర్స్(E-commerce) రంగానికి డిమాండ్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-12-11 15:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ఇటీవల కాలంలో ఈ- కామర్స్(E-commerce) రంగానికి డిమాండ్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ- కామర్స్ రంగంలో పని చేసే గిగ్(Gig),ప్లాట్‌ఫామ్‌(Flatform) వర్కర్ల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి సామజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం(Central Govt) త్వరలో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా(Sumita Davra) స్వయంగా వెల్లడించారు. గిగ్, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లు సాంప్రదాయ ఉద్యోగులు కారని, ఇప్పటివరకు వారికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు(Job Benefits), సామజిక భద్రత(Social Security) లేవని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన ఈ-కామర్స్, సేవా రంగానికి మరింత ఊతం ఇచ్చేలా త్వరలో ఓ కొత్త పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నామని తెలిపారు. కాగా గిగ్, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లుకు పెన్షన్(Pension), ఆరోగ్య బీమా(Health Insurance) వంటి సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) సెప్టెంబర్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేశంలో ప్రస్తుతం సుమారు 70 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లు ఉన్నారని, వచ్చే ఐదేళ్లల్లో ఈ సంఖ్య మూడు కోట్లకు చేరొచ్చని నీతి అయోగ్ (Niti Aayog) అంచనా వేసింది.

Tags:    

Similar News