Elon Musk Net Worth : 350 బిలియన్ డాలర్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద..!

ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత ఎలన్ మస్క్(Elon Musk) సంపద భారీగా పెరిగింది.

Update: 2024-12-03 12:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత ఎలన్ మస్క్(Elon Musk) సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం మస్క్ నికర సంపద 350 బిలియన్ డాలర్లు దాటిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్(Bloomberg Billionaire Index) పేర్కొంది. నవంబర్ 5 నుంచి టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరగడంతో ఆయన సంపద $350 బిలియన్లు దాటింది. దీంతో చరిత్రలో తొలిసారి $350 బిలియన్ల సంపదను మస్క్ క్రాస్ చేశారు. కాగా ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో మస్క్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే కొత్త ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి కూడా దక్కింది. దీంతో టెస్లా కంపెనీ షేర్లు రాకెట్ లా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెజాన్(Amazon) ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff Bezos) 231 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. మెటా సీఈఓ(Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ 210 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఒరాకిల్‌(Oracle) చైర్మన్‌ లారీ ఎల్లిసన్‌(Larry Ellison) $198B, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ ‘ఎల్‌వీఎంహెచ్(LVMH)’ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్(Bernard Arnault) $198B తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags:    

Similar News