ఛత్తీస్ గఢ్ లో పిడుగు పడి ఎనిమిది మంది మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు..పిడుగులే బీభత్సం తీవ్ర విషాదం సృష్టిస్తున్నాయి. రాజ్ నందన్గాన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పిడుగులు పడి ఎనిమిది మంది మృతి చెందారు.

Update: 2024-09-23 10:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు..పిడుగులు బీభత్సం తీవ్ర విషాదం సృష్టిస్తున్నాయి. రాజ్ నందన్గాన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పిడుగులు పడి ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని  సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఐఎండీ అధికారులు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇదే నెల 8వ తేదీన ఛత్తీస్ గఢ్ లోని బలోదాబాజార్ భటపరా జిల్లా మొహతారా గ్రామంలో పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందారు. 


Similar News