భారత్‌లో మూడో మంకీపాక్స్ కేసు నమోదు

భారత్‌లో మూడో మంకీపాక్స్(monkeypox ) కేసు నమోదు అయింది. ఇవాళ(సోమవారం) దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

Update: 2024-09-23 12:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో మూడో మంకీపాక్స్(monkeypox ) కేసు నమోదు అయింది. ఇవాళ(సోమవారం) దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అనుమానంతో అధికారులు టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. మంకీపాక్స్ గ్రేడ్-1 బీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, పలు దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) కేసుల సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు రెండుగా ఉన్న కేసులు.. ఇవాళ మూడుకు చేరాయి. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ(Department of Health) అప్రమత్తమైంది.

విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్‌ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, త్వరగా చికిత్స పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే బాధితులు ముందుగానే కుటుంబానికి సోకకుండా ఐసోలేట్‌ అవ్వాలని చెబుతున్నారు. భారత్‌లో సెప్టెంబర్‌ 9న తొలి కేసు.. సెప్టెంబర్‌ 18న రెండో కేసు.. సెప్టెంబర్ 23న మూడో కేసు నమోదైంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


Similar News