బిగ్ న్యూస్: కర్నాటకలో ఆ పార్టీదే అధికారం.. జర్నలిస్టుల సర్వేలో సంచలన ఫలితాలు!

మే 10న జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Update: 2023-04-28 11:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మే 10న జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఎలక్షన్స్‌ను సెమీ ఫైనల్‌గా భావిస్తుంటడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేదానిపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈ క్రమంలో 100 మంది పాత్రికేయులతో 'ఈ దిన' సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతోందనేది ఈ సర్వే వెల్లడించింది. ఈ సారి హస్తం పార్టీ 132-140 స్థానాలు తన ఖాతాలో వేసుకోబోతుందని 57-65 సీట్లతో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక 19-25 సీట్లతో జేడీఎస్ మూడో స్థానంలో నిలువగా 1-5 మధ్య స్థానాల్లో ఇతరులు జెండా పాతబోతున్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది.

ఓట్ షేరింగ్ విషయంలో గత ఎన్నికతో పోలిస్తే కాంగ్రెస్ ఈ సారి గణనీయంగా ఓట్ షేర్ పెంచుకోబోతోందని.. గతంలో 38.1 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగా ఈసారి 43 శాతం ఓట్లు తమ వైపు తిప్పుకోబోతున్నట్లు వెల్లడైంది. ఇక బీజేపీకి 2018లో 36.3 శాతం ఓట్లు పోల్ అవ్వగా ఈ సారి 33 శాతానికి తగ్గిపోతుందని తెలిపింది. జేడీఎస్ ఓట్ల శాతం 18.3 శాతం నుంచి 16 శాతంగా ఉండబోతుందని అంచనా వేసింది. ఇతరులు 7.4 శాతం నుంచి 8 శాతంగా ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కొనసాగాలని 33 శాతం ప్రజలు కోరుకుంటుంటే 67 శాతం ప్రజలు ఈ ప్రభుత్వం కొనసాగవద్దని అభిప్రాయపడినట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి.

హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఆ పార్టీదే హవా:

నార్త్ కర్ణాటకలో కాంగ్రెస్ స్వీప్ చేయబోతుందని, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో మొత్తం 40 స్థానాలు ఉంటే 31-37 మధ్య సీట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉందని ఈ దిన సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ 2-4 స్థానాలు, జేడీఎస్ 2-4 సీట్లను దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఇక ముంబై కర్ణాటకలో 50 స్థానాలకు గాను కాంగ్రెస్ 40-46 సీట్లు, బీజేపీ 3-7, జేడీఎస్ 0-2, కోస్టల్ కర్ణాటక(19)లో కాంగ్రెస్ 5-9, బీజేపీ 10-14, జేడీఎస్ 0, సెంట్రల్ కర్ణాటక(26)లో కాంగ్రెస్ 3-7, బీజేపీ19-23, జేడీఎస్ 0, సదరన్ కర్ణాటక(61)లో కాంగ్రెస్ 26-32, బీజేపీ 10-14, జేడీఎస్ 15-19, బెంగళూరు(28)లో కాంగ్రెస్ 16-20, బీజేపీ 6-10, జేడీఎస్ 1-3 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

Tags:    

Similar News