కర్ణాటక CM సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ముడా(Mysore Urban Development Authority) వివాదంలో కేసు నమోదు చేసినట్లు సోమవారం ఈడీ(Enforcement Directorate) అధికారులు ప్రకటించారు.

Update: 2024-09-30 13:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ముడా(Mysore Urban Development Authority) వివాదంలో కేసు నమోదు చేసినట్లు సోమవారం ఈడీ(Enforcement Directorate) అధికారులు ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనీలాండరింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. కాగా ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య, మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసు నమోదు చేశారు. సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా చేర్చారు. అంతేకాదు.. సీఎంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ సైతం అనుమతిని ఇవ్వడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.


Similar News