Bengaluru University:బెంగళూరు విశ్వవిద్యాలయంలో జానపదం,సాహిత్యంపై వ్యాసాలకు ఆహ్వానం

బెంగళూరు విశ్వవిద్యాలయం(Bengaluru University)లోని తెలుగు డిపార్ట్‌మెంట్(Telugu Department) ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ 20,21 తేదీల్లో తెలుగు, కన్నడ జానపద,గిరిజన సాహిత్యం,తులనాత్మకత అనే అంశంపై జాతీయ సదస్సు(National Conference)ను నిర్వహిస్తున్నారు.

Update: 2024-09-30 15:23 GMT

దిశ, వెబ్‌డెస్క్:బెంగళూరు విశ్వవిద్యాలయం(Bengaluru University)లోని తెలుగు డిపార్ట్‌మెంట్(Telugu Department) ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ 20,21 తేదీల్లో తెలుగు, కన్నడ జానపద,గిరిజన సాహిత్యం,తులనాత్మకత అనే అంశంపై జాతీయ సదస్సు(National Conference)ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తెలుగు డిపార్ట్‌మెంట్ అధ్యక్షురాలు  కె.ఆశాజ్యోతి(k.Aashajyothi)  ఓ ప్రకటనలో తెలిపారు. ఆచార్యులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, PHD విద్యార్థులను ఈ సదస్సుకు స్వాగతిస్తున్నామని, అలాగే వ్యాసాలకు ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు.ఈ జాతీయ సదస్సుకు హాజరు కావాలనుకునే వారు గూగుల్ ఫామ్ ద్వారా వివరాలను నమోదు చేసి,దరఖాస్తు చేసుకోవాల్సింటుందని తెలిపారు.అలాగే పరిశోధన పత్రాల(Research Documents)ను తప్పులు లేకుండా పిడిఎఫ్,ఓపెన్ ఫైల్స్ రూపంలో telugusaksha2024@gmail.comకి నవంబర్ 15 లోపు పంపించాలని,మిగతా వివరాలకు 9339672394 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

(నోట్:పరిశోధన పత్రాలు అను-7,ప్రియాంక ఫాంట్ ,18 సైజులో టైప్ చెయ్యాలి)


Similar News