సబ్సు పెట్టెల్లో రూ.37కోట్ల విలువైన డ్రగ్స్‌..అసోంలో పట్టివేత

అసోంలోని శివసాగర్ జిల్లాలో సబ్సు పెట్టెల్లో తీసుకెళ్తున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Update: 2024-06-17 18:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని శివసాగర్ జిల్లాలో సబ్సు పెట్టెల్లో తీసుకెళ్తున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున నాగాలాండ్ నుంచి వస్తున్న ఓ ట్రక్కును శివసాగర్ జిల్లా పోలీసులు అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని తనిఖీ చేయగా..4.6 కిలోల బరువున్న హెరాయిన్‌తో కూడిన 399 సబ్సు బాక్సులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.37 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, గతంలోనూ అసోంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.


Similar News