భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద భారీగా డ్రగ్స్ పట్టివేత..

మణిపూర్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద ఓ వ్యక్తి నుంచి రూ. 25 కోట్లు విలువచేసే మత్తు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు.

Update: 2023-02-23 16:19 GMT

ఇంఫాల్: మణిపూర్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద ఓ వ్యక్తి నుంచి రూ. 25 కోట్లు విలువచేసే మత్తు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. తెంగ్నౌపాల్ జిల్లాలో డబ్ల్యూవై టాబ్లెట్ల రూపంలో ఈ మత్తు పదార్థాలు ఉన్నాయి. రోజువారీ పెట్రోలింగ్‌లో భాగంగా మోరే టౌన్‌లో రాష్ట్ర పోలీసులు, ఆస్సాం రైఫిల్ బృందం కలిసి తనిఖీలు చేపట్టారు. దీంతో పైచాంగ్ వెంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 'వరల్డ్ ఈజ్ యువర్స్' (డబ్ల్యూవై) అనే టాబ్లెట్స్‌ను కనుగొన్నారు.

వీటి బరువు 56 కిలోలు ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. 'అతని అనుమానాస్పద కదలికను పసిగట్టిన సిబ్బంది అతడిని కలిశారు. అతను పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకుని విచారించారు. అతని నివాసంలో తనిఖీలు చేయగా మాదక ద్రవ్యం లభించింది' అని ఆ అధికారి వివరించారు. అతని వద్ద నుంచి ఒక మయన్మార్ సిమ్ కార్డ్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం మోరే పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్టు సరిహద్దు పోలీసులు చెప్పారు.

Tags:    

Similar News