ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ మరింత ఈజీ.. ఆర్టీఏ చుట్టూ తిరగాల్సిన పని లేదంట!

డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత ఈజీ కానుంది. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదంట.

Update: 2024-05-21 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత ఈజీ కానుంది. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదంట. లైసెన్స్‌ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్‌లను జారీ చేయవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు జూన్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అందుకోసం కొన్ని సెపరేట్ రూల్స్ సైతం విధించారు.ఫోర్‌ వీలర్‌ పరీక్ష నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు కచ్చితంగా 3 ఎకరాల స్థలం ఉండాలని తెలిపింది.

రూల్స్‌కు అనుగుణంగా టెస్ట్ నిర్వహించేందుకు అన్ని సదుపాయాలు కలిగి ఉండాలన్నారు. ట్రైనర్లు కచ్చితంగా హైస్కూల్‌ చదువు, డ్రైవింగ్‌లో ఐదేళ్లు అనుభవం పొంది ఉండాలని సూచించారు. వీరికి బయోమెట్రిక్స్‌, ఐటీ లాంటి వాటిపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు.డ్రైవింగ్ నేర్పించే సమయంలోనూ నిబంధనలు పాటించాల్సి ఉంది. లైట్‌ వెహికిల్‌ ట్రైనింగ్‌ను కచ్చితంగా నాలుగు వారాల పాటు, కనీసం 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.

ఇందులో 8 గంటలు థియరీ క్లాస్, 21 గంటలు ప్రాక్టికల్‌ తరగతులు పెట్టాలని పేర్కొన్నది. హెవీ మోటార్‌ వాహనాల డ్రైవింగ్‌కు ఆరు వారాల పాటు కనీసం 39 గంటల ట్రెయినింగ్‌, 8 గంటలు థియరీ క్లాస్, 31 గంటలు ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహించాలని నిబంధనలు విధించింది. డ్రైవింగ్ సెంటర్‌ అన్ని నిబంధనలు పాటిస్తేనే డ్రైవింగ్‌ టెస్టు చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.

  Read More..

Viral Video:సినిమా లెవల్‌లో మాజీ లవర్ విశ్వరూపం..అర్జున్ రెడ్డిని దింపేశాడుగా!  

Tags:    

Similar News