టీఎంసీకి తలుపులు తెరిచే ఉన్నాయి: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. గ్వాలియర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమితో టీఎంసీ కలుస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. బీజేపీని ఓడించడమే మమతా లక్ష్యమని ఆమె ఖచ్చితంగా కలిసి వస్తుందని తెలిపారు. ‘టీఎంసీని ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉంది. మమతా పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాలకు ఏకపక్షంగా పోటీ చేస్తానని మాత్రమే ప్రకటించింది. సీట్ షేరింగ్ విషయంలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లోని పాట్నాలో ఉమ్మడిగా ప్రతిపక్షాల ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీతో బీజేపీని ఓడించడానికి ఐక్యతలను చూపుతామని చెప్పారు. దీనిలో పాల్గొనేందుకు రాహుల్ కూడా భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చారని స్పష్టం చేశారు. త్వరలోనే ఇండియా కూటమి మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని అన్ని సీట్లలో టీఎంసీ పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని మమతా బెనర్జీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాల్లో సీట్ షేరింగ్‌పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో జైరాం రమేశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.