సునీతా విలియమ్స్‌ గురించి బెంగ వద్దు : ఇస్రో చీఫ్

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్న అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పష్టం చేశారు.

Update: 2024-06-29 18:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్న అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పష్టం చేశారు. ఐఎస్ఎస్‌లో చాలా నెలలుగా దాదాపు 9 మంది వ్యోమగాములు కూడా ఉంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఐఎస్ఎస్‌లో ఉండే వ్యోమగాములు కొన్ని నెలల పాటు డ్యూటీ చేశాక.. భూమికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటారని చెప్పారు. ప్రస్తుతం వాళ్లతో కలిసి సునీతా విలియమ్స్ సేఫ్‌గానే ఉన్నారని సోమనాథ్ చెప్పారు.

ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు అవసరమైన చాలా మార్గాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు.  బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సునీతా విలియమ్స్ సహా మరో వ్యోమగామి జూన్ ఐదో తేదీన ఐఎస్ఎస్‌కు వెళ్లారు. వారు జూన్ పద్నాలుగో తేదీనే తిరిగి రావాల్సి ఉండగా.. స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వారు ఐఎస్ఎస్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌కు మరమ్మతులు చేయడంపై నాసా, బోయింగ్ సైంటిస్టులు ఫోకస్ పెట్టారు. 


Similar News