మోడీ అంతటి బలమైన నాయకుడిని చూడలేదు : Ajit Pawar

ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంతటి బలమైన నాయకుడు మరెవరూ కనిపించడం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు.

Update: 2023-08-07 13:58 GMT

పూణే: ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంతటి బలమైన నాయకుడు మరెవరూ కనిపించడం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరాలనే తన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారని, అయితే.. ఒక వ్యక్తి తన ‘అనుభవాల’ ఆధారంగా భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాడని చెప్పారు. ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ జూలై 2వ తేదీన ఎన్సీపీకి చెందిన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. అజిత్ పవార్ చాలా కాలం తర్వాత ఇప్పుడు సరైన స్థానంలో ఉన్నారని, అయితే.. ఆయన ఆ స్థానానికి ‘చాలా ఆలస్యంగా వచ్చారని’ చెప్పారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం, ఈ ప్రాంతాన్ని మార్చడం, అనేక సమస్యలను పరిష్కరించడం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నియోజక వర్గాల్లో తమ పనిని పూర్తి చేయడంలో సహాయ పడటానికి శివసేన-బీజేపీ కూటమిలో చేరాలని తాను గతంలోనే పునరుద్ఘాటించానని చెప్పారు. మహారాష్ట్రలోని 44 రైల్వే స్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా 500 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు ప్రధాని రూ.25 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. సహకార రంగంలో గత 20-22 ఏళ్లలో తీసుకోని సాహసోపేత నిర్ణయాలను అమిత్ షా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నారని అభినందించారు. వ్యవసాయ రంగంలో పెండింగ్ నిర్ణయాలను ప్రధాని మోడీ నేతృత్వంలో అమిత్ షా తీసుకున్నారనే వాస్తవాన్ని రైతులుగా మనం అంగీకరించాలన్నారు.


Similar News