'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం.. సొంతంగా గెలవడమే లక్ష్యం'

కర్నాటక అసెంబ్లీ పోల్స్ లో జనతా దళ్ (సెక్యులర్) గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవె గౌడ విశ్వాసం వ్యక్తం చేశారు

Update: 2023-04-27 16:36 GMT

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ పోల్స్ లో  జనతా దళ్ (సెక్యులర్) గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవె గౌడ విశ్వాసం వ్యక్తం చేశారు. " రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతోందో.. ఎలాంటి మార్పు రాబోతోందో అందరూ చూస్తారు" అని ఆయన ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్ఘిన ఇంటర్వ్యూలో చెప్పారు. " ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇతరుల అంచనాలపై నేను స్పందించదలచుకోలేదు. ప్రజలు ఇచ్చే తీర్పు వచ్చేవరకు

వాళ్ళను ఆనందించనివ్వండి" అని దేవె గౌడ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనేదీ లేదని.. సొంతంగా ఎన్నికల్లో గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. "రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ కర్నాటక ఎన్నికల బరిలో ఉన్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? అనేది ఇప్పుడే అంచనా వేయలేం.

'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం.. సొంతంగా గెలవడమే లక్ష్యం'అయితే కొంతమంది తామే మెజార్టీ సాధిస్తామని ప్రకటించుకుంటున్నారు" అని దేవె గౌడ చెప్పారు. " హంగ్ అసెంబ్లీ వస్తుందని ఇంకొందరు చెబుతున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రుల పై ఇటీవల నిర్వహించిన పలుసర్వేల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. హెచ్ డీ కుమార స్వామి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని ఆ సర్వేల్లో తేలిందట " అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News