ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవికి Adesh Gupta అదేష్ గుప్తా రాజీనామా
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేష్ గుప్తా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేష్ గుప్తా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రాజీనామాను ఆమోదించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవాకు బాధ్యతలు అప్పగించారు. తదుపరి అధ్యక్షుడిగా వీరేంద్రను కొనసాగించనున్నారు. గత వారం వెలువడిన మున్సిపల్ ఫలితాల్లో ఆప్ 134 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ 104 స్థానాల్లో గెలిచి రెండో స్థానానికి పడిపోయింది. దీంతో 15 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికల్లో కాషాయపార్టీ ఆధిపత్యానికి తెరపడింది.