ICUలో చికిత్స.. సీతారాం ఏచూరి హెల్త్ అప్డేట్ ఇచ్చిన వైద్యులు

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-08-20 05:15 GMT
ICUలో చికిత్స.. సీతారాం ఏచూరి హెల్త్ అప్డేట్ ఇచ్చిన వైద్యులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో సోమవారం రాత్రి ఢిల్లీలో ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అప్‌డేట్ ఇచ్చారు. ఏచూరి నిమోనియాతో బాధపడుతున్నారని తెలిపారు. దీంతో ఐసీయూలో చేర్చుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, మరోవైపు ఇటీవలే ఏచూరి కంటి శుక్లాల ఆపరేషన్ చేయించున్నట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.

Tags:    

Similar News