Deepinder Goyal: జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌కు ఎదురైన చేదు అనుభవంపై స్పందించిన మాల్..!

జొమాటో డెలివరీ బాయ్స్(Zomato Delivery Boys) విధుల్లో ఉండగా ఎదురవుతోన్న సమస్యలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ఆ సంస్థ సీఈఓ దీపిందర్‌ గోయల్‌కు (CEO Deepinder Goyal)ఈ రోజు చేదు అనుభవం(Bitter Experience) ఎదురైన విషయం తెలిసిందే.

Update: 2024-10-07 17:12 GMT

దిశ, వెబ్‌డెస్క్:జొమాటో డెలివరీ బాయ్స్(Zomato Delivery Boys) విధుల్లో ఉండగా ఎదురవుతోన్న సమస్యలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ఆ సంస్థ సీఈఓ దీపిందర్‌ గోయల్‌కు (CEO Deepinder Goyal)ఈ రోజు చేదు అనుభవం(Bitter Experience) ఎదురైన విషయం తెలిసిందే. ఆర్డర్Order ను తీసుకోవడానికి గురుగ్రామ్(Gurugram) లోని ఓ మాల్(Mall)లోకి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. లిఫ్ట్ కాకుండా మెట్ల ద్వారా వెళ్లాలని సిబ్బంది అతనికి సూచించారు. దీంతో అతను ఆర్డర్ ను పిక్ చేసుకోవడానికి మూడు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కాగా తనకు ఎదురైనా అనుభవాన్ని 'ఎక్స్(X)​'లో పోస్ట్ చేశాడు. గోయల్‌ చేసిన పోస్ట్​పై సదరు మాల్ స్పందించింది. డెలివరీ బాయ్స్ కోసం ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ పికప్ పాయింట్‌ ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.ఈ విషయాన్ని గోయల్‌ 'ఎక్స్' వేదికగా షేర్‌ చేసుకున్నారు.డెలివరీ బాయ్స్ కు ఎదురవుతోన్న సమస్యలపై ఆ మాల్ స్పందించింది. డెలివరీ బాయ్స్ కోసం ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ పికప్ పాయింట్‌ ఏర్పాటు చేసింది. నేను చేసిన పోస్ట్ కు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. మాల్ లోని రెస్టారెంట్ల నుంచి పికప్ పాయింట్‌లకు త్వరగా ఆహారాన్ని అందజేయడానికి మాల్ లోపల కొన్ని వాకర్లను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.ఇతర మాల్ యజమానులు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అని గోయల్ తెలిపారు.

     


Similar News