Abhimanyu: కేంద్రం డిసిషన్‌పైనే రైతుల ధర్నా ఆధారపడి ఉంది.. అభిమన్యు కోహర్

తమ నిరసనను ఎంతకాలం కొనసాగించాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉందని రైతు నాయకుడు అభిమన్యు కోహర్ స్పష్టం చేశారు.

Update: 2025-01-02 15:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమ నిరసనను ఎంతకాలం కొనసాగించాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉందని రైతు నాయకుడు అభిమన్యు కోహర్ (Abhimanyu kohar) స్పష్టం చేశారు. ఎంఎస్పీకి చట్టపరమైన హామీని పార్లమెంటరీ ప్యానెల్ (Parlamentary panel) సిఫార్సు చేసినందున తమ డిమాండ్‌లను అంగీకరించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదని నొక్కి చెప్పారు. దల్లెవాల్ (Dallewal) నిరవధిక నిరాహార దీక్ష 38వ రోజుకు చేరుకుందని ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. గురువారం ఆయన శంభు సరిహద్దు(Shambu barder)లో మీడియాతో మాట్లాడారు. రైతుల ఆందోళనలు విరమించే విషయం కేంద్రం చేతుల్లోనే ఉందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దల్లేవాల్‌ డిమాండ్లను కేవలం రైతు నాయకులు మాత్రమే చేస్తున్నారన్నారు. పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసినందున వెంటనే ఎంఎస్పీ అమలు చేయాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దల్లేవాల్ తన ప్రాణాలను పణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More ....

Khushboo : అన్నా యూనివర్సిటీ ఘటనలో ప్రభుత్వ వైఖరీ ఆక్షేపణీయం : బీజేపీ నాయకురాలు కుష్బూ


Tags:    

Similar News