Israel-Hamas War: అంతర్జాతీయ కోర్టు తీర్పుపై ఇజ్రాయెల్ ప్రధాని అంతృప్తి

ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం(International Court ) తీర్పుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2024-07-20 08:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం(International Court ) తీర్పుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్‌ తమ అధీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధమని అంతర్జాతీయక ర్టు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని పేర్కొంది. అక్కడ కాలనీల నిర్మాణాన్ని నిలిపివేయాలంది. 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ అజమాయిషీ ఏంటని ప్రశ్నించింది. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెం ప్రాంతాలపై నియంత్రణ, సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. అన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని వెల్లడించింది.

నెతన్యాహు ఏమన్నారంటే?

ఆక్రమిత ప్రాంతాలపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం కోర్టు అనడం హాస్యాస్పదం అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఆ మూడు ప్రాంతాలు యూదుల చారిత్రాక మాతృభూమిలో భాగమన్నారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంది. ఇదో అభిప్రాయం మాత్రమే అని అన్నారు. అంతర్జాతీయ కోర్టుది అబద్ధాల నిర్ణయం అని విమర్శించారు. ఆ తీర్పుతో చారిత్రక సత్యాన్ని వక్రీకరించలేం అన్నారు.


Similar News