ఖబడ్దార్..! సీఎంని చంపేస్తాం

‘‘ఖబడ్దార్.. సీఎంని చంపేస్తాం..’’ అని బెదిరించాడో యువకుడు. ఎలక్షన్ టైంలో వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ విధంగా బెదిరింపులకు దిగిన అజ్మీర్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

Update: 2024-10-13 04:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘‘ఖబడ్దార్.. సీఎంని చంపేస్తాం..’’ అని బెదిరించాడో యువకుడు. ఎలక్షన్ టైంలో వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ విధంగా బెదిరింపులకు దిగిన అజ్మీర్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. హర్యానాలోని జింద్ జిల్లా ప్రాంత పోలీసులు సుమిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే.. అక్టోబర్ 8న హర్యానాలో ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో జులానాకు చెందిన అజ్మీర్ ఓ వాట్సాప్ గ్రూపులో బీజేపీ సీఎం నాయాబ్ సైనీని చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలియగానే.. వెంటనే పోలీసులు అజ్మీర్‌ను అరెస్ట్ చేశారు.

హర్యానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆమె తన ప్రత్యర్థి, బీజేపీకి పార్టీకి చెందిన యోగేష్ కుమార్‌పై 6,015 ఓట్లతో గెలిచారు. మొత్తంగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని మూడోసారి అధికారం సొంతం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ 37 సీట్లకే పరమితం కావడంతో కచ్చితంగా గెలుస్తామనుకున్న ఆ పార్టీకి నిరాశే మిగిలింది.

Similar News