దావూద్ భాయ్ సూపర్ ఫిట్‌గా ఉన్నాడు: చోటా షకీల్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని వార్తాకథనాలు వెలువడుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని వార్తాకథనాలు వెలువడుతున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం నిజమేనని నిఘా వర్గాలు నిర్ధారించాయి. అయితే, దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాకిస్తాన్‌లోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది.
తాజాగా.. దావూద్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్పందించారు. దావూద్ చనిపోయాడంటూ వస్తోన్న వార్తలను ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేశారు. ‘దావూద్ భాయ్ వెయ్యిశాతం ఫిట్‌గా ఉన్నాడు’ ఓ మీడియా చానల్ ప్రతినిధితో చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, మరోవైపు దావూద్‌పై విష ప్రయోగం జరిగిందని, అతడు చావుబతుకుల మధ్య పాకిస్తాన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ప్రచారం జరుగుతోంది.