బిగ్ ట్విస్ట్.. బాలికపై లైంగిక వేధింపుల కేసులో మాజీ CM యడ్యూరప్పకు అరెస్ట్ వారెంట్

బాలికపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం

Update: 2024-06-13 12:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలికపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పకు బెంగళూరు కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో యడ్యూరప్పను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. కాగా, తన 17 ఏళ్ల కూతురిపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారిస్తోన్న కర్నాటక సీఐడీ అధికారులు దర్యాప్తుకు రావాలని యడ్యూరప్పకు నోటీసులు జారీ చేశారు.

అయితే, ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నానని ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని.. ఈ నెల 17వ తేదీన దర్యాప్తుకు హాజరు అవుతానని తెలిపారు. ఈ క్రమంలోనే యడ్యూరప్పకు బెంగళూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం యడ్యూరప్ప కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలోనే యడ్యూరప్ప అరెస్ట్‌కు బెంగుళూర్ కోర్టు వారెంట్ జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో నెక్ట్స్ ఈ కేసులో ఏం జరుగుతుందోనని కర్నాటక పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 


Similar News