చేసేది స్వీపర్ ఉద్యోగం.. ఆస్తి కోట్లలో.. అవాక్కైన అధికారులు

చేస్తుంది నాలుగవ తరగతి ఉద్యోగం అయినా.. ఆస్తి మాత్రం కోట్ల కొద్ది సంపాదించాడు యూపీలోని ఓ స్వీపర్.

Update: 2024-08-18 11:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : చేస్తుంది నాలుగవ తరగతి ఉద్యోగం అయినా.. ఆస్తి మాత్రం కోట్ల కొద్ది సంపాదించాడు యూపీలోని ఓ స్వీపర్. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన సంతోష్ జైస్వాల్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. ఆ తర్వాత లంచం ఇచ్చి డివిజినల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ గా పదోన్నతి పొందాడు. ఆఫీసులోని ఫైళ్లను తారుమారు చేసి రూ.కోట్లల్లో కమీషన్లు పొందాడు. ఫైళ్ళ విషయం బయటపడి కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సంతోష్ పేరు వెల్లడి కావడంతో అతన్ని సస్పెండ్ చేసి, కేస్ పెట్టారు అధికారులు. అయితే విచారణ కోసం సంతోష్ ఇంటికి వెళ్ళిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలిసాయి. ఇంద్రభవనం లాంటి ఇంటితోపాటు, ఆ ఇంటి ముందు 9 లగ్జరీ కార్లు కూడా ఉండటంతో పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు. ఆ వాహనాలను సీజ్ చేసి, బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. కాగా అతడిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు.  


Similar News