రాహుల్‌పై పీకే కామెంట్స్.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సంచలన సలహాలపై అంతటా చర్చ జరుగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సంచలన సలహాలపై అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. పక్కకు తప్పుకొని వేరే వాళ్లకు దారివ్వాలని రాహుల్ గాంధీకి పీకే హితవు పలకడంపై భిన్నవిభిన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ టాపిక్‌పై కాంగ్రెస్ కూడా స్పందించింది. తాజాగా సోమవారం రోజు కాంగ్రెస్ మీడియా సమావేశం సందర్భంగా పీకే కామెంట్స్‌పై ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినతేను మీడియా ప్రశ్నించింది. ఆమె బదులిస్తూ.. ‘‘కన్సల్టెంట్ల వ్యాఖ్యలకు మేం సమాధానం చెప్పం.. రాజకీయ నాయకుల గురించి ఏదైనా ఉంటే చెప్పండి.. మాట్లాడుతాం.. కన్సల్టెంట్ల మాటలకు సమాధానం ఏమని చెప్పాలి?’’ అని ప్రశ్నించారు.