పాకిస్థాన్‌ను చూసి కాంగ్రెస్ భయపడుతోంది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పాకిస్థాన్‌ను చూసి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించి మాట్లాడటం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు.

Update: 2024-05-28 12:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌ను చూసి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించి మాట్లాడటం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఒడిశాలోని జాజ్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అందుకే పీఓకే ప్రస్తావన తేవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. పీఓకేని ఎప్పటికైనా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 147 అసెంబ్లీ సీట్లకు గాను 75 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాబోతుందని దీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత నవీన్ పట్నాయక్ మాజీ సీఎం అవుతారని విమర్శించారు.

అలాగే 21 లోక్‌సభ స్థానాలకు గాను 17 స్థానాలను కాషాయ పార్టీ గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. తదుపరి ముఖ్యమంత్రి ఒడియా భాషలో అనర్గళంగా మాట్లాడగలరని, అంతేగాక రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాన్ని అర్థం చేసుకునేలా ఉంటారని తెలిపారు. అటువంటి వ్యక్తినే బీజేపీ సీఎంగా చేస్తుందని హామీ ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి యువకులు వేరే చోటు వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News