కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
Congress chief Mallikharjun Kharge's shocking comments
రాంచీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు లోపల, బయట మాట్లాడే స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. తన పార్లమెంటు ప్రసంగాన్ని తొలగించారని చెప్పారు. శనివారం జార్ఖండ్ సాహెజ్ గంజ్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 60 రోజుల పాటు సాగే 'హథ్ సే హథ్ జోడో యాత్ర'లో ఆయన మాట్లాడారు. 2014లో ద్రవ్యోల్బణాన్ని నిలువరిస్తామనే హామీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, పేదరికం పెరుగుతున్నాయని మండిపడ్డారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడటమే కాకుండా మౌళిక వసతుల కల్పన చేసింది కాంగ్రెసేనని చెప్పారు.