స్కూల్ విద్యార్థుల మధ్య గొడవ.. ఉదయపూర్ లో 144 సెక్షన్

మధ్యాహ్న భోజనం సమయంలో ఇద్దరి విద్యార్థుల మధ్య మొదలైన గొడవ చివరకు ఆ నగరం మొత్తం 144 సెక్షన్ విధించేలా చేసింది.

Update: 2024-08-16 16:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : మధ్యాహ్న భోజనం సమయంలో ఇద్దరి విద్యార్థుల మధ్య మొదలైన గొడవ చివరకు ఆ నగరం మొత్తం 144 సెక్షన్ విధించేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవయింది ఉదయపూర్ లోని ఓ స్కూల్లో. స్కూల్ ముగిసి విద్యార్థులు ఇంటికి వెళ్తున్నపుడు, గొడవ పడిన ఇద్దరలో ఒకరు మరొకరి మీద అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. దాడికి గురైన విద్యార్థి రక్తపు మడుగులో కుప్పకూలగా, స్కూల్ టీచర్లు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని హిందూ సంఘాలు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ రణరంగంగా మారిపోయింది. వారికి మరికొందరు యువకులు తోడై ఆస్పత్రిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్ల మీదికి వచ్చిన కనపడిన వాహనాలను ధ్వంసం చేస్తూ, దుకాణాలకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మూకను చెదరగొట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో 144 సెక్షన్ విధించారు. అయితే రెండు మతాలకు చెందిన విద్యార్థులు దాడి చేసుకున్నారనే ఊహాగానాల వల్లే ఈ అల్లర్లు చెలరేగాయని అధికారులు తెలిపారు.          


Similar News