Kapil Sibal : 'నా కెరీర్ లోనే అరుదు'.. ప్రధాని, సీజేఐ సమక్షంలో కపిల్ సిబాల్ కీలక అంశం ప్రస్తావన

బెయిల్ విషయంలో కపిల్ సిబాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-31 12:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమైన కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టులు, సెషన్స్ కోర్టులు విముఖత చూపడం ఆందోళనకరం అని సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిణామం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నెలకొని ఉన్న దుస్థితికి లక్షణం అని అన్నారు. శనివారం ఢిల్లీలో జిల్లా న్యాయ వ్యవస్థ అంశంపై రెండు రోజుల పాటు జరగబోయే జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీజేఐ డీవై చంద్రచూడ్ హాజరైన ఈ కార్యక్రమంలో ట్రయల్ కోర్టులు బెయిల్ నిరాకరించడం వల్ల ఆ భారం అంతా పై కోర్టులపై పడుతున్నదన్నారు. నా కెరీర్ లోనే జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు కావడం చాలా అరుదుగా చూశానని, ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదని సీజేఐ చంద్రచూడ్ అనుభవం కూడా అన్నారు. స్వేచ్ఛ అనేది అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి పునాది వంటిందని ఏ ప్రయత్నమైనా మన ప్రజాస్వామ్యం పై విశ్వాసంపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా, సెషన్స్ కోర్టులకు భయం లేకుండా లేదా అనుకూలంగా న్యాయం చేయడానికి అధికారం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.


Similar News