అమెరికాలో అంతర్యుద్ధం... అగ్రరాజ్యం అధ్యక్షుడిగా Elon Musk

నూతన సంవత్సరం సందర్భంగా భవిష్యత్తు గురించి చెప్పేవారు, చెప్పించుకునేవారు చాలా మందే ఉంటారు. కానీ...'Civil war in US, Elon Musk to…' Russian official's wild predictions for 2023

Update: 2022-12-27 13:46 GMT

మాస్కో: నూతన సంవత్సరం సందర్భంగా భవిష్యత్తు గురించి చెప్పేవారు, చెప్పించుకునేవారు చాలా మందే ఉంటారు. కానీ రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్ పర్సన్ అయిన ద్మిత్రీ మెద్వదేవ్ 2023లో జరిగే పరిణామాలపై ఊహకు కూడా అందని జోస్యాలు చెప్పి అందరికీ షాక్ తెప్పించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి ఊహిస్తుంటారు. చాలామంది రేపు ఏం జరుగుతుందనే విషయంలో ఊహకల్పన చేస్తుంటారు. వీటిలో అత్యంత క్రూరమైన ఊహలు, అసంగతమైన ఊహలు కూడా ఉండవచ్చు అని మెద్వదేవ్ మంగళవారం ట్వీట్ చేశారు. అలా ట్వీట్ చేస్తూనే తాను కూడా కొన్ని భవిష్యత్ అంచనాలు ప్రతిపాదించారు. అవి నిజంగానే క్రూరమైన, అత్యంత అసంబద్ధమైన ఊహలుగా కనిపిస్తున్నాయి.

మెద్వదేవ్ జోస్యం ప్రకారం... అమెరికాలో అంతర్యుద్దం జరుగుతుంది. దీంతో కాలిఫోర్నియా, టెక్సాస్ అమెరికా నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా మారుతాయి. టెక్సాస్, మెక్సికోలు విలీనమై ఒక ప్రత్యేక దేశంగా మారుతాయి. కొత్త అంతర్యుద్ధం అంతమయ్యాక ప్రపంచ కుబేరుల్లో అగ్రగామిగా ఉన్న ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారు అంటూ మెద్వదేవ్ చావు జోస్యం చెప్పారు. ఇక బ్రిటన్ విషయానికి వస్తే మళ్లీ యూరోపియన్ యూనియన్‌లో చేరుతుందని, దాన్నుంచి ఐర్లండ్ స్వతంత్ర దేశంగా విడిపోతుందని చెప్పారు. ఇక చమురు ధరలు బ్యారెల్‌కి 150 డాలర్లకు పెరిగిపోతుందని చెప్పారు. అలాగే పోలెండ్ హంగరీలు ఉక్రెయిన్ పశ్చిమ భాగాలను స్వాధీనపర్చుకుంటాయని ఊహించారు. ఇకపోతే పోలెండ్, బాల్టిక్ దేశాలు, చెచియా, స్లోవేకియా, కీవ్ రిపప్లిక్, ఇతర ఇరుగు పొరుగు దేశాలను కలుపుకుని జర్మనీ ఫోర్త్ రీచ్‌ని ఏర్పరుస్తుందంటూ వణికించే జోస్యాన్ని చెప్పారు. హిట్లర్ అధ్వర్యంలో 1930లలో జర్మనీలో ధర్డ్ రీచ్ ఏర్పడటం తెలిసిందే. మెద్వదేవ్ చెప్పిన చావు జోస్యాలు మరీ అసంబద్ధంగా ఉండవచ్చు కానీ ఆయన భవిష్యత్ జోస్యాలు వైరల్ అవుతున్నాయి.

Read more:

102 మంది పిల్లలను కన్న వ్యక్తి.. చివరికి షాకింగ్ డెసిషన్! 

హస్త ప్రయోగంతో మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? 

Tags:    

Similar News