ఏరివేత ఆపరేషన్‌తో నక్సలైట్లకు దడ మొదలైంది.. సీఎం కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నక్సల్స్ ఏరివేతకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌తో నక్సల్స్‌లో దడ, కలవరం మొదలయ్యాయన్నారు. జనవరి 30న రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో నక్సలైట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు చెందిన ముగ్గురు సిబ్బందికి సీఎం విష్ణుదేవ్ సాయి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మరో 15 మంది సిబ్బంది కోలుకుంటున్నారని సీఎం తెలిపారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సీఆర్పీఎఫ్ సైనికుడిని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పరామర్శించారు.