Chandrayaan-3: చంద్రుడికి మరింత చేరువైన చంద్రయాన్‌-3..

చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత చేరువైంది.

Update: 2023-08-14 14:35 GMT

బెంగళూరు: చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత చేరువైంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ వ్యౌమనౌక కక్ష్యను నిర్దిష్ట స్థాయిలో(150 కి.మీ x 177 కి.మీలకు) తగ్గించే ప్రక్రియను సోమవారం సక్సెస్ ఫుల్‌గా నిర్వహించామని ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్) నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించింది. తదుపరిగా కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 16న ఉదయం 8.30కు చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరుతుందని ఇస్రో వివరించింది. ఆ దశ కూడా జరిగాక.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోతుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టనుంది.


Similar News