Nuclear Power Plant: న్యూక్లియర్ పెంచుకోవడానికి కేంద్రం కసరత్తు
దేశవ్యాప్తంగా న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటు చేయాలనే బృహత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ లైఫ్ అయిపోయిన చోట, బొగ్గు వనరులు కరిగిపోయిన చోట ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటు చేయాలనే బృహత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ లైఫ్ అయిపోయిన చోట, బొగ్గు వనరులు కరిగిపోయిన చోట ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శిలాజ ఇంధనమైన బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా న్యూక్లియర్ రియాక్టర్లు నెలకొల్పడంలో ప్రైవేటు భాగస్వాములతోనూ పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తావన చేసినట్టు వివరించింది.