Rice Export : బియ్యం ఎగుమతులపై బ్యాన్ ఎత్తివేసిన కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో : బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-28 18:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంగా బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బాస్మతీ బియ్యం మినహా అన్ని రకాల బియ్యం వెరైటీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించింది. అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులను ఇక అనుమతిస్తామని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. కానీ, తక్షణమే అమల్లోకి వచ్చేలా టన్నుకు కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)గా రూ.41వేలు (490 డాలర్ల)ను నిర్దేశించింది. ఒక ఉత్పత్తిని విదేశీ కొనుగోలుదారులకు విక్రయించడానికి ఉద్దేశించిన కనీస నిర్ణీత ధరను ఎంఈపీ అంటారు. దీని కంటే తక్కువ రేటుకు ఎగుమతి చేయడానికి వీలుండదు.

అతి తక్కువ ధరలకే భారీగా ఎగుమతులు చేయడాన్ని నిరోధించడానికి ఎంఈపీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. దేశీయంగా బియ్యం ధరలను నియంత్రించడానికిగానూ బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గత సంవత్సరం జులైలో ప్రభుత్వం బ్యాన్ విధించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికిపైగా వాటా మన దేశానిదే. 2021-22లో భారత్ దాదాపు 22 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసింది. మన మొత్తం దేశీయ బియ్యం ఉత్పత్తిలో ఇది ఆరో వంతుకు సమానం.


Similar News